జగన్ అనే నేనుగా.. మళ్లీ 2024లో మీ వద్దకు వస్తా: వైసీపీ అధినేత జగన్

  • తూ.గో. జిల్లా లోని పెద్దాపురంలో బహిరంగసభ
  • 2018 లేదా 2019 లోనో ఎన్నికలు జరుగుతాయి 
  • అధికారంలో కొస్తే ఒక్క మందు షాపూ లేకుండా చేస్తా 

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పెద్దాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, దేవుడు ఆశీర్వాదం, ప్రజల దీనెనలతో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి, అధికారంలోకి వస్తే ఒక్క మందు షాపు కూడా లేకుండా చేస్తానని హామీ యిస్తున్నానని అన్నారు.

‘2018 లోనో లేదా 2019 లోనో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత ఐదేళ్లకు 2024లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయి. జగన్ అనే నేనుగా.. మళ్లీ 2024లో జరిగే ఎన్నికల కోసం మీ దగ్గరకు వచ్చే సరికి ఒక్క మందు షాపు కూడా కనపడకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను.చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని, దీవించమని, తోడుగా ఉండమని ప్రాధేయపడుతున్నాను’ అని అన్నారు.