జంపింగ్ ఎమ్మెల్యేలకి కేసీఆర్ మార్క్ షాక్ ట్రీట్మెంట్

తెలంగాణలో ప్రతిపక్షము లేకుండా చేద్దామనే ఒకే ఒక లక్ష్యంతో తెరాస అధినేత కేసీఆర్ కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకున్నారు. అలా చేరిన వారికీ మంత్రి పదవి, నామినేట్,చీఫ్ విప్ లాంటి పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళని చేర్చుకున్నారు, అలా చేరిన వారికి ఎలాంటి పదవులు దక్కే ఛాన్స్ లేదని అర్ధం అవుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకొని కారెక్కిన జంపింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నారు.

తెరాస ప్రభుత్వంలో కేసీఆర్ ని మించిన మరో శక్తి లేదు. ఆయనకి నచ్చిందే శాసనంగా భావించి ఆ పార్టీలోని నేతలు ముందుపోవాలి. మంత్రి పదవుల విషయానికి వస్తే సొంత కొడుకు, అల్లుడికే ఇప్పటిదాకా మంత్రి పదవులు లేకపోయేసరికి ఖాళీగా ఉన్నారు. ఈ స్థితిలో జంపింగ్ చేసిన ఎమ్మెల్యేలకి మంత్రి పదవి అంటే చాలా కష్టం. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డికి మహిళల కోటాలో మంత్రి పదవి ఇస్తానని చెప్పి పార్టీలోకి తీసుకున్నారు, కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వారీగా చూసుకుంటే మల్లారెడ్డి ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు కాబట్టి సబితా ఇచ్చే ప్రసక్తే లేదు.

అలాగే ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా మంత్రి పదవి హామీతో కారెక్కాడు, అతనికి కూడా మొండిచెయ్యి చూపించాడు కేసీఆర్. వీళ్ళే కాకుండా ఆత్రం సక్కు – రేగా కాంతారావు – వీరయ్యలు ఇప్పుడు మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కందుల ఉపేందర్ రెడ్డి వనమా వెంకటేశ్వరరావులు విప్ కానీ నామినెటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్న వాళ్లే, వాళ్లందరికీ కూడా కేసీఆర్ తన మార్క్ షాక్ ఇచ్చాడనే చెప్పాలి.
Tags: kcr, jumping mla’s, telangana govt