AP CM JAGAN

చిన్నాన్న హత్య కేసు – రెండు రోజులే డెడ్ లైన్.. : సీఎం జగన్ ఆగ్రహం

 

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురై ఆరు నెలలు గడుస్తోంది. ఈ కేసు మిస్టరీని ఛేదించడంలో పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు నిందితులు ఎవరన్నది తేలడంలేదు. ఈ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతొంది . దీని పైన రాజకీయ విమర్శలే కాదు. ముఖ్యమంత్రి జగన్ కు సొంత కుటుంబ సభ్యులు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం వైస్ జగన్ తన తండ్రి వర్దంతి రోజు పులివెందులకు వెళ్లారు. అక్కడ వివేకా విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం వివేకా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ సమయంలోనే హత్య కేసు సూత్రధారులు ఎవరో ఇంకా తేలకపోవటం పైన వారు ప్రశ్నించినట్లు సమాచారం. ఈసందర్భంగా జగన్ నేరుగా డీజీపీకి ఫోన్ చేసి ఫైర్  అయినట్లు  సమాచారం .  రెండు రోజుల్లో  కేసు మిస్టరీ తేల్చాల్సిందేనంటూ ఆదేశించారు. వెంటనే డీజీపీ కడపకు బయల్దేరి , స్వయంగా విచారణ పర్యవేక్షిస్తున్నారు.