చంద్రబాబు వ్యూహాలను జగన్ తట్టుకోలేరు: ఉండవల్లి

జగన్ సభలకు జనాలు వస్తున్నప్పటికీ.. చివరకు పరిస్థితి మారుతుంది
గత ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందన్నారు.. చివరకు టీడీపీ గెలిచింది
2014లో కాంగ్రెస్ పరిస్థితి ఎలాగుందో.. ఇప్పుడు బీజేపీది అదే పరిస్థితి
రానున్న ఎన్నికల్లో ఏపీలో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యే ఉంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. జగన్ సభలకు ఓ సినీ నటుడిని చూసేందుకు వస్తున్నట్టుగా, భారీ ఎత్తున జనాలు వస్తున్నప్పటికీ… ఎన్నికల సమయానికి పరిస్థితి తారుమారు అవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ వ్యూహాలు, ఎన్నికల నిర్వహణ ముందు జగన్ తట్టుకోలేరని ఆయన స్పష్టం చేశారు.

గత ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని ప్రచారం చేశారని… కానీ, చివరకు టీడీపీనే ఆధిక్యాన్ని సాధించిందని చెప్పారు. జనసేన అధినేత పవన్ గురించి ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. 2014లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా అలాగే తయారయిందని చెప్పారు. ప్రత్యేక హోదాతో ఈశాన్య రాష్ట్రాలకు ప్రయోజనం లేకపోయినప్పటికీ, ఏపీకి మాత్రం ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.