చంద్రబాబు ఫోటోను తొలగించిన సుజనా చౌదరి

టీడీపీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి బీజేపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిపోవడంతో సుజనాచౌదరి తన ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్ల ప్రొఫైల్ పిక్చర్స్ ను మార్చేశారు.

ఫేస్ బుక్ ప్రొఫైల్ లో బీజేపీ కండువాతో ఉన్న ఫోటో, కింద ప్రధాని నరేంద్రమోదీ ఫోటోలతో తన ఫేస్ బుక్ ప్రొఫైల్ మార్చేశారు. అలాగే రాజ్యసభ సభ్యులు వెబ్ సైట్లలో కూడా బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా మార్చేసుకున్నారు.

పార్టీ మారడంతో టీడీపీతో ఉన్న ప్రొఫైల్ ఫోటోలను తొలగించిన సుజనాచౌదరి తన నివాసంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోటోను సైతం తొలగించారు. తన ఇంటి ఎంట్రన్స్ లో ఉన్న ఫోటోను  ఇంటిలో పనిచేసే సిబ్బంది తొలగించేయడం చర్చనీయాంశంగా మారింది.