చంద్రబాబు గారూ... మీ పాలన అంతానికి ఇదే సాక్ష్యం: విజయసాయి రెడ్డి

చంద్రబాబు గారూ… మీ పాలన అంతానికి ఇదే సాక్ష్యం: విజయసాయి రెడ్డి

  • హత్యాయత్నాన్ని కోడికత్తి డ్రామాగా చూపాలని విఫలం
  • మీ పతనాన్ని మీరే కొనితెచ్చుకున్నారు
  • రాహుల్ గాంధీ కూడా రక్షించలేరు
  • ఫేస్ బుక్ లో విజయసాయిరెడ్డి

చంద్రబాబు పరిపాలన అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెట్టిన ఆయన, జగన్ పై జరిగిన హత్యాయత్నాన్ని, కోడికత్తి నాటకంగా చూపాలని భావించిన చంద్రబాబు విఫలం అయ్యారని మండిపడ్డారు.

“మీరు ప్రయోగించిన కోడికత్తి ఇప్పుడు మీ మెడకే చుట్టుకుంది చంద్రబాబుగారూ. మీ పరిపాలన అంతానికి అది సాక్ష్యంగా నిలుస్తుంది. మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నారు. ప్రాణాలు తీసే నాటకం సక్సెస్ కాలేదు. మీ ధృతరాష్ట్ర పాలన అంతానికి టైమ్ వచ్చేసింది. రాహుల్ రక్షించలేడు. మీరు కాళ్లు పట్టుకున్న ఏ నేతలు వచ్చే ఎలక్షన్లలో మీ పరాజయాన్ని అడ్డుకోలేరు. ప్రజలు తరిమితే సింగపూర్ పారిపోతారో, స్విట్జర్లాండ్ పోతారో పెట్టే బేడా సర్దిపెట్టుకోండి. జగన్నాథ రథచక్రాలు కదిలి వస్తున్నాయి” అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.