చంద్రబాబుపై వైఎస్ జగన్ గవర్నర్ కు ఫిర్యాదు

Share This
  • ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలు
  • వైసీపీ కార్యకర్తల పై టీడీపీ దాడులు
  • చంద్రబాబు ఆదేశాల మేరకేనన్న జగన్

 

ఏపీలో టీడీపీ అనుచరుల దాడులు పెరిగిపోయాని జగన్ గవర్నర్ కు ఐచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నరసింహన్ కు వినతిపత్రాన్ని సమర్పించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గురజాల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల రోజున జరిగిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లిన జగన్, పోలీసులు కూడా అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతూ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఆ తరువాత తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. చంద్రబాబునాయుడి ఆదేశాల మేరకే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.  జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.