చంద్రబాబుకు సినీ ఆర్టిస్టులు కూడా ప్రచారం చేయడంలేదు

  • చంద్రబాబుకు సినీ ఆర్టిస్టులు కూడా ప్రచారం చేయడంలేదు
  • సభలకు జనాలు రావడం లేదని బాబు ఆపసోపాలు
  • వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

 

జనం తన బహిరంగ సభలకు రావడలేదని చంద్రబాబు ఆపసోపాలు పడుతున్నారని  ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు విసిరారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలవరని తెలిసి ఆయన తరపున ప్రచారం చేసేందుకు సినీ ఆర్టిస్టులు కూడా తప్పించుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాల నాయకుల ప్రచారం ముగిసిందని, చంద్రబాబు తన సభలకు జనాలు రావడం లేదని తెలిసి,  బాబుకు సాయంగా కె.రాఘవేంద్రరావు ద్వారా సినీ హీరోలు, కథానాయికలను రప్పించడానికి నానా తంటాలు పడుతున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబుకు గెలిచే సీన్ లేదని అర్థం కావడంతో జూనియర్ ఆర్టిస్టులు కూడా ఆయన తరపున ప్రచారం చేసేందుకు ఇష్ట పడటంలేదని, వారు తప్పించుకు తిరుగుతున్నారని విజయసాయిరెడ్డి సెటైర్లు విసిరారు.