గౌరవం లేని చోట ఉండొద్దని జితేందర్ రెడ్డికి చెప్పాం: డీకే అరుణ

గౌరవం లేని చోట ఉండొద్దని జితేందర్ రెడ్డికి చెప్పాం: డీకే అరుణ

టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి నిన్న బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన డీకే అరుణ స్పందించారు. జితేందర్ రెడ్డి చేరిక బీజేపీకి పెద్దబలమని అన్నారు. గౌరవం లేని చోట ఉండొద్దని జితేందర్ రెడ్డికి చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు కూడా అవమానం జరిగినందుకే ఆ పార్టీ నుంచి బయటకొచ్చేసినట్టు చెప్పారు.