సోషల్ మీడియా సెన్సేషన్ రాణు మొండల్‌పై బాలీవుడ్ సీనియర్ నేపథ్య గాయని లతా మంగేష్కర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతూ విమర్శిస్తున్నారు.

గాయని లతామంగేష్కర్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు

సోషల్ మీడియా సెన్సేషన్ రాణు మొండల్‌పై బాలీవుడ్ సీనియర్ నేపథ్య గాయని లతా మంగేష్కర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతూ విమర్శిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో లత.. రాణు మొండల్ గురించి మాట్లాడుతూ.. అనుకరణ ఎప్పుడూ నిజం కాబోదని, అది కలకాలం నిలవదని, అలా వచ్చిన విజయం ఎల్లకాలం ఉండబోదని వ్యాఖ్యానించారు. లత వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు కురిపించారు. లత వ్యాఖ్యలు సరికావంటూ ట్విట్టర్ వేదికగా దుమ్మెత్తి పోశారు.

రైల్వే ప్లాట్‌ఫాంపై పాటలు పాడి జీవించే ఓ మహిళలోని ప్రతిభను ఎవరో గుర్తించడంతో ఆమె స్టార్‌గా మారిందని, ఇది ఎంతో మందికి స్ఫూర్తి అని, అటువంటి మహిళపై దయ చూపి, అభినందించి సాయం చేయాల్సిన లత ఇలా ‘అనుకరణ’ లెక్చర్ ఇవ్వడం బాగాలేదని విమర్శిస్తున్నారు. ఇది అంగీకార యోగ్యం కాదని కొందరు తప్పుబట్టారు. ఓ గొప్ప గాయని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మరికొందరు పేర్కొన్నారు. లత లాంటి గొప్ప వ్యక్తి కూడా రాణును అంగీకరించలేకపోతున్నారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.