ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం నమూనా విడుదల!

  • 61 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతి విగ్రహం
  • నమూనాను విడుదల చేసిన గణేశ్ ఉత్సవ కమిటీ
  • 12 తలలు, 24 చేతులతో కొలువుదీరనున్న గణనాథుడు

దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు ఈ ఏడాది కొత్తరూపంలో దర్శనం ఇవ్వనున్నాడు. ఈసారి గణేశుడు ‘ద్వాదశాదిత్య మహా గణపతిగా’గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ విగ్రహ నమూనాను తాజాగా విడుదల చేసింది. 12 తలలు, 24 చేతులు, సప్త అశ్వాలతో కూడిన సూర్యరథంపై ఈసారి గణనాథుడు కొలువు దీరనున్నాడు. ఈ వినాయకుడి విగ్రహాన్ని 61 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయనున్నారు.  ద్వాదశాదిత్య మహా గణపతికి కుడివైపున మహా విష్ణువు, ఏకాదశి దేవి, ఎడమవైపున బ్రహ్మవిష్ణుమహేశ్వర సమేత దుర్గాదేవి దర్శనం ఇవ్వనున్నారు.