కొండగట్టు ప్రమాద ఘటన.. ఆ బస్సు నడిపింది ‘ఉత్తమ డ్రైవర్’!

కొండగట్టు ప్రమాద ఘటన.. ఆ బస్సు నడిపింది ‘ఉత్తమ డ్రైవర్’!

  • ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాస్ సహా 55 మంది మృతి
  • ఇటీవలే ‘ఉత్తమ డ్రైవర్’ అవార్డు అందుకున్న శ్రీనివాస్
  • కొందరు ప్రయాణికులు డ్రైవర్ వైపు ఒరగడంతో ప్రమాదం

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్ లో జరిగిన బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 55 మంది మృతి చెందగా, ముప్పై మంది గాయపడ్డారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ శ్రీనివాస్ కూడా మృతి చెందారు. కాగా, ఈ ఆగస్టు 15న డ్రైవర్ శ్రీనివాస్ ‘ఉత్తమ డ్రైవర్’ అవార్డును అందుకోవడం విశేషం. కండక్టర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ బస్సులో కొందరు ప్రయాణికులు డ్రైవర్ వైపు ఒరగడం వల్లే అదుపు తప్పి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం.