కేసీఆర్ పై రీసర్చ్ మొదలు పెట్టా: రామ్ గోపాల్ వర్మ

 

 

  • కేసీఆర్ పై బయోపిక్ నిర్మించబోతున్నా
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఇంతవరకు సెన్సార్ బోర్డు చూడలేదు
  • చిత్రం విడుదలకు ఆటంకాలు ఉండవనే భావిస్తున్నా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బయోపిక్ ను తెరకెక్కించనున్నానని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు .  కేసీఆర్ పై ఇప్పటికే రీసర్చ్ మొదలు పెట్టానన్నారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఇంత వరకు సెన్సార్ బోర్డు చూడలేదని  తెలిపారు. ఈనెల 29న సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఉండవనే అనుకుంటున్నానని చెప్పారు. ఈ చిత్రాన్ని తమకు చూపించాలంటూ మరోవైపు ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఈసీ సంతృప్తి చెందితేనే అనుకున్న సమయానికి విడుదలవుతుంది. లేకపోతే ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాతే విడుదలయ్యె అవకాశం ఉంది .