కేసీఆర్ చివరకు ఓడిపోయిన నేతల్ని కూడా వదలట్లేదు: చంద్రబాబు

కేసీఆర్ చివరకు ఓడిపోయిన నేతల్ని కూడా వదలట్లేదు: చంద్రబాబు

రేపు మేనిఫెస్టో విడుదల
175 సీట్లు గెలవడమే లక్ష్యం
కోడికత్తి పార్టీ డ్రామాలను అరికట్టగలం
ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మరోసారి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తన పార్టీలోకి ప్రతి ఒక్కరినీ లాక్కుంటున్నారని, చివరకు ఓడిపోయిన నేతల్ని కూడా వదలటం లేదని పరోక్షంగా నామా నాగేశ్వరావు చేరికను ఉద్దేశించి విమర్శించారు. ఏపీలో 175 సీట్లు గెలవడమే తమ లక్ష్యమని, అప్పుడే కోడికత్తి పార్టీ డ్రామాలను అరికట్టగలమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే, టీడీపీ మేనిఫెస్టోని రేపు విడుదల చేయనున్నట్టు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.