కేసీఆర్ చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం

200 మంది రుత్వికులతో సీఎం కేసీఆర్ చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహించనున్నారు. జనవరి 21 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు 5 రోజులపాటు ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సహస్ర చండీయాగం చేస్తారు. తెలంగాణలో సకాలంలో వర్షాలు పడి, రైతులు సుభిక్షంగా ఉండేలా, ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరాఘాటంగా కొనసాగేలా, బంగారు తెలంగాణ కల సాకారం అయ్యేలా అమ్మవారి అనుగ్రహం కోసం కేసీఆర్ సహస్ర హోమాలు చేయనున్నారు. యాగశాల నిర్మాణం, ఇతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. కేసీఆర్, సహస్ర చండీయాగానికి పండితులను, యోగులకు స్వాములను ఆయన ఆహ్వానాలు పంపారు. ఈనెల 25 వ తేదీన పూర్ణాహుతి నిర్వహిస్తామరు.