కేసీఆర్ కు ‘హుజూర్’ నగర్ 15 రౌండ్లలోనూ శానంపూడి ఆధిక్యం

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితంలో కారుకు ఎదురేలేదు. టాప్‌గేర్‌లో దూసుకుపోతున్న కారు వేగానికి కాంగ్రెస్‌ ఖతమైంది. ఇప్పటి వరకు వెల్లడైన 15 రౌండ్లలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు. 14వ రౌండ్‌లో 26,999, 15వ రౌండ్‌లో 29,967 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇంకా ఏడు రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

దీంతో సైదిరెడ్డి విజయం ఖాయమైపోయింది. శానంపూడి సైదిరెడ్డికి తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 2,467 ఓట్ల ఆధిక్యం సాధించగా, రెండో రౌండ్‌లోనూ 4 వేల మెజార్టీతో, మూడో రౌండ్‌లో 6,777, నాలుగో రౌండ్‌లో 9,356, ఐదో రౌండ్‌లో 11 వేలు, ఆరో రౌండ్‌లో 12,356, ఏడో రౌండ్‌లో 14,300, ఎనిమిదో రౌండ్‌లో 17,400, తొమ్మిదో రౌండ్‌లో 19,200, పదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 20 వేలు, 11వ రౌండ్‌లో 21,618, 12వ రౌండ్‌లో 23,821, 13వ రౌండ్‌ లో 25,366 ఓట్ల మెజార్టీ వచ్చింది.