కేరళ వరదలకు భీమా క్లెయిమ్ ల అంచనా వింటే షాక్ అవ్వాల్సిందే….?

కొద్దిరోజులుగా కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి వాగులు వంకలు ఉప్పొంగి వరదలు రావడంతో రాష్ట్రంలోని ప్రజలు అతలాకుతలం అయ్యారు. దాదాపుగా అక్కడి ముఖ్య ప్రాంతాలు అన్నీకూడా జలమయం అవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే ప్రభుత్వం వరదల బారిన ప్రజలను రక్షించేందుకు ఎక్కడికక్కడ రక్షణ మరియు సహాయక బృందాలను రంగంలోకి దింపి వీలైంతమందికి రక్షించే ఏర్పాట్లు చేసింది. ఈ విపత్తు కోసం కేంద్రం కూడా కొన్ని రక్షణ దళాలను కేరళకు పంపింది. ఇక ఇప్పటికే ప్రభుత్వం చెపుతున్న లెక్కల ప్రకారం ఈ వరదల్లో దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం అందుతోంది. కాగా వివిధ రాష్ట్రాల ప్రముఖులు మరియు సినీ రాజకీయ నాయకులు, మరియు సాధారణ ప్రజానీకం సైతం కేరళ ప్రజలను ఆదుకునేందుకు తమ ఆపన్నహస్తాన్ని ఇస్తూ ముందుకు వస్తున్నారు.

ఇకపోతే ఈ వరదల వల్ల కేరళకు దాదాపు రూ.20,000కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, కేరళ మళ్ళి పూర్వస్థితికి రావాలంటే కనీసం పదేళ్లయినా పడుతుందని నిపుణులు చెపుతున్నారు. ఇక అక్కడి ప్రజలు మాట్లాడుతూ, తమ రాష్ట్రంలో ఇటువంటి విపత్తును ఇప్పటివరకు చూడలేదని, దేవుడు చాలావరకు అందరిని రక్షించి బ్రతికించినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వరదల్లో నష్టపోయిన వారు చేసుకున్న భీమా క్లెయిమ్ లు దాదాపు రూ.1,000 కోట్లకు పైమాటే ఉండొచ్చు అని పలు ఇన్సూరెన్సు కంపెనీలు అంచనా వేస్తున్నాయి. నేషనల్‌ ఇన్సూరెన్స్‌, న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌లు ఇప్పటికే బీమా పరిహారాలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే వారందరు చెపుతున్నట్లు ఈ అంచనా ఖచితమైనది కాదని, తమకు వున్న సమాచారం మేరకు అది మరొకొంత పెరిగే అవకాశం కూడా ఉందని ఓరియంటల్ ఇన్సూరెన్సు కంపెనీ చైర్మన్ గిరిజకుమార్ అంటున్నారు…..
Tags: national insurance,kerala, recent flood,estimation