కేటీఆర్ గారూ.. నా కొత్త జాబ్ ఎలా ఉంది?: ఉపాసన కొణిదెల ట్వీట్

టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన కొత్త జాబ్ లో చేరారు. అంతేకాదు నా కొత్త జాబ్ ఎలా ఉంది సార్? అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సరదాగా ప్రశ్నించారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశాలకు ఉపాసన వెళ్లారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు సమాచారం ఇచ్చేందుకు టీఎస్ ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ డెస్క్ కు ఆమె కోర్డినేటర్ గా వ్యవహరించారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ డెస్క్ లో కాసేపు కూర్చున్నారు. అంతేకాదు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కూడా ఆమె కలిశారు. ప్రపంచంలోని అత్యాధునిక హెల్త్ కేర్ వ్యవస్థలను ప్రారంభించేందుకు మైక్రోసాఫ్ట్ తో కలసి పని చేయబోతున్నట్టు తెలిపారు.

Leave a Reply