కేంద్రమంత్రి అనంత్ కుమార్ కన్నుమూత!

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్రమంత్రి అనంత్‌కుమార్ కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రిగా ఉన్నారు.

22 జనవరి 1959న బెంగళూరులో అనంత్ కుమార్ జన్మించారు. మైసూరు యూనివర్సిటీ నుంచి న్యాయశాఖలో పట్టా అందుకున్నారు. దక్షిణ బెంగళూరు లోక్ సభ స్థానం నుంచి 1996లో తొలిసారి ఎంపీగా గెలిచిన అనంత్‌కుమార్ వరుసగా ఆరుసార్లు ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు. తొలిసారి ఎంపీగా గెలిచిన వెంటనే పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేశారు. 1998లో విమానయాన శాఖ, పర్యాటక శాఖలు కూడా నిర్వర్తించారు.