కేంద్రం ప్రవేశపెట్టబోయేది తాత్కాలిక బడ్జెట్టే: పియూష్ గోయల్

కేంద్రం ప్రవేశపెట్టబోయేది తాత్కాలిక బడ్జెట్టే: పియూష్ గోయల్

పూర్తి స్థాయి బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టబోతోందంటూ వార్తలు 
ఈ వార్తలను ఖండించిన కేంద్ర ఆర్థిక శాఖ
ఫిబ్రవరి 1న కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఆర్థిక శాఖ కొట్టిపారేసింది. తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నామని తెలిపింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం తాత్కాలిక బడ్జెట్ ను మాత్రమే ప్రవేశపెడుతుందని చెప్పారు. వైద్య చికిత్స కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అమెరికాకు వెళ్లడంతో… గోయల్ కు ఆర్థిక శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో, పార్టమెంటులో ఆయనే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.