‘కాస్టింగ్ కౌచ్’పై ఏ మాత్రం జంకు లేకుండా సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మి!

తాజాగా ‘అంతకుమించి’ చిత్రంతో తన అందాలను ఆరబోస్తూ, ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాంకర్, నటి రష్మి, టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’పై ఏ మాత్రం జంకు లేకుండా సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశం కోసం వెళ్లడమన్నది తన దృష్టిలో ఒక చాయిస్ మాత్రమేనని, దాన్ని తాను గౌరవిస్తానని చెప్పిన రష్మి, కెరీర్ బాగుంటుందనిపిస్తే, కాస్టింగ్ కౌచ్ కి అంగీకరించడంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించింది.

‘అంతకుమించి’ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న రష్మికి, మీడియా నుంచి కాస్టింగ్ కౌచ్ పై స్పందించాలంటూ ఓ ప్రశ్న ఎదురైంది. ఇది ఇద్దరి వ్యక్తిగత విషయమని, వారిద్దరి అంగీకారంతోనే జరుగుతుందని అంది. దాన్ని కాస్టింగ్ కౌచ్ అని ఎలా చెప్పగలమని ప్రశ్నించింది. ఆ బంధాన్ని వాళ్లు ఎంజాయ్ చేసి, ఆపై బయటకు వచ్చి గొడవ చేయడం ఏంటని అడిగింది. అవకాశాలు ఇస్తామంటే, ఆశపడి వెళ్లిన తరువాత, మళ్లీ గోల పెట్టాల్సిన అవసరం లేదని రష్మి కుండబద్ధలు కొట్టింది. ప్రతి రంగంలోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని, కానీ, సినిమా ఇండస్ట్రీనే పెద్దదిగా చేసి చూపిస్తున్నారని ఆరోపించింది. తనతో మాత్రం ఏ నిర్మాత కూడా తప్పుగా ప్రవర్తించలేదని చెప్పింది. నిర్మాతలతో తనకు రెమ్యునరేషన్ విషయంలోనే విభేదాలు వచ్చాయని చెప్పింది. రష్మి కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Tags: rasmi latest, comments,casting couch