కాజల్ ను ముద్దు పెట్టుకోవడంపై చోటా కె నాయుడి వివరణ!

సౌందర్య తర్వాత నేను ఎక్కువ అభిమానించింది కాజల్ నే
కాజల్ తో చాలా సినిమాలకు పని చేశా
ఆమె పనితనాన్ని మెచ్చుకునేందుకే ముద్దు పెట్టా
‘కవచం’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హీరోయిన్ కాజల్ ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు పబ్లిక్ గా ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. ఆయనను ఫిలిం ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, గతంలో హీరోయిన్స్ తో ఆయన అసభ్యకరంగా మాట్లాడిన పాత వీడియోలను కూడా షేర్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఈ అంశంపై చోటా కె నాయుడు స్పందించారు. సౌందర్య తర్వాత తాను అంతగా అభిమానించింది కాజల్ నే అని ఆయన చెప్పారు. కాజల్ తో కలసి చాలా సినిమాలకు పని చేశానని… ఆమె పనితనాన్ని మెచ్చుకునేందుకే ఆమెను ముద్దు పెట్టుకున్నానని… అంతకు మించి ఇందులో మరేమీ లేదని వివరణ ఇచ్చారు.