telangana govt cog

కాగ్‌ రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర అప్పులు ₹ 1 లక్షా 42 వేల కోట్లు.

రెవెన్యూ రాబడితో పోలిస్తే వడ్డీ చెల్లింపులు 12.19శాతంగా ఉంది.

ఏటికేడు పెరుగుతున్న వడ్డీ చెల్లింపుల శాతం.

వచ్చే ఏడేళ్లలో రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులు ₹ 65,740 కోట్లు.

వాస్తవానికి తెలంగాణ రెవెన్యూ లోటు ₹ 284.74 కోట్లు.

ద్రవ్యలోటు ₹ 27,654 కోట్లు.

క్యాపిటల్‌ వ్యయం విషయంలో తెలంగాణ ముందంజలో ఉన్నా,
విద్యారంగం కేటాయింపుల్లో వెనుకబాటు.

2014-18 మధ్య ప్రాజెక్టులపై రూ.79, 236 కోట్ల ఖర్చు

ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఆర్థికవృద్ధి సాధ్యం కాలేదు.

19 ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం ₹ 41,021 కోట్లు.

పనుల జాప్యం కారణంగా ₹ 1 లక్షా 32 వేలకు పెరిగింది.

గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్ నుంచి అప్పులపై ఆధారపడటం వల్ల వడ్డీల చెల్లింపులు పెరిగాయి.

సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎక్కువ ఖర్చులు చేస్తుంది. కానీ ఫలితాలు ప్రకటించడం లేదు.

ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వల్ల అంచనా వ్యయం విపరీతంగా పెరిగింది.

19 సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తొలి అంచనా వ్యయం ₹ 41.201 కోట్లు, ఉంటే జాప్యం కారణంగా అది ₹ 1 లక్ష 32 వేల 928 కోట్లకు పెరిగింది.

ఈ ప్రాజెక్టులపై ₹ 70,758 కోట్లు ఇప్పటి వరకు ఖర్చయినా అవి ఇంకా పూర్తి కాలేదు.

డిస్కమ్ ల ఆర్థిక పునరుత్తేజం జరగాలంటే, రాష్ట్ర ప్రభుత్వం తన బకాయిలను విడుదల చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు జీఎస్డీపీ వృద్ధి రేటు కన్నా పెరిగాయి.

వైద్య ఆరోగ్య, సాంఘిక సంక్షేమ విభాగాల కింద పదే పదే మిగుళ్ళు ఏర్పడుతున్నాయి.

ఖర్చు సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ శాఖల అసమర్ధతను సూచిస్తుంది.

స్వయం పాలన సంస్థల్లో (జలమండలి, హెచ్ఎండీఏ లాంటి సంస్థలు) వార్షిక పద్దులను సమర్పించడంతో జాప్యం చేస్తున్నాయి.

అత్యవసర ఖర్చుల కోసం ₹ 280.45 కోట్లు డ్రా చేసినా బిల్లులు పెట్టలేదు.

నిర్దిష్టమైన గడువులోగా బిల్లులు సమర్పించకపోవడం ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘించడమే.

శాసనసభ సూచించిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు ప్రభుత్వం చేసింది.

ప్రాజెక్టుల జాప్యం కారణంగా ₹ 1 లక్ష 32 వేల ఖర్చు పెరిగింది.