కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన రాహుల్ గాంధీ

 

 

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విడుదల చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో హమ్‌ నిభాయేంగే పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో విడుదల చేశారు. తమ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉందన్నారు. సంక్షేమంతో సంపద సృష్టించడమే లక్ష్యమని రాహుల్‌ పేర్కొన్నారు. ఉద్యోగ కల్పన, రైతు సమస్యలే ప్రధాన అజెండా అని అన్నారు.