telangana, elections,results, chandra babu naidu

కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు.. శ్రుతిమించిన చంద్రబాబు ప్రచారం 

  • బిజేపి దీర్ఘకాలిక ప్రయోజనం..లోపాయకారి ఒప్పందం
  • టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కూటమి వైపు పోకుండా బిఎల్ఎఫ్ అడ్డు కట్ట
  • ఆలస్యంగా మహాకుటమి అభ్యర్దుల  ప్రకటన 
  • మరోమారు సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చిన కేసిఅర్  
  • టిఆర్ఎస్ ను వ్యతిరేకించిన ఉద్యోగులు చంద్రబాబు రాకతో యూ టర్న్
  • మహా కూటమిలోని పార్టీల ఓట్ల బదిలి సరిగా జరగలేదు
తెలంగాణా ఓటింగ్ పలితాలను నిశితంగా పరిశీలిస్తే…కర్ణుని చావుకు సవాలక్ష కారణాలుగా స్పష్టం అవుతుంది.
మహా కూటమికి రావలసిన టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను బిజెపి అన్ని స్థానాల్లో పోటీ చేయడం ద్వారా తన ఖాతాలో వేసుకుంది. బిజెపి కనక అన్ని స్థానాల్లో పోటీ చేయకుంటే బిజెపి కీ ఉన్న ఓట్లు కూడ మహా కూటమికి పడేవి. ఇది టిఆర్ఎస్-బిజెపి ఆంతరంగిక అవగాహనలో భాగంగానే బిజెపి అన్ని స్థానాల్లో పోటీ చేయడం,మహా కూటమి కంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని విమర్శించి వ్యతిరేక ఓట్లను తనవైపు మళ్ళించుకున్నది బిజెపి.
అలాగే మైనారిటీ ఓట్లు మహా కూటమి వైపు పోకుండా ఎంఐఎం ని ముందు చూపుతో చాలాకాలం నుండే తన మిత్ర పక్షంగా మలచుకొని వారి విశ్వాసాన్ని చూరగొని మైనారిటీ ఓట్లు టిఆర్ఎస్ కే పడే విధంగా వ్యూహరచన చేసిన కె.సి.ఆర్ సక్సెస్ అయ్యారు. అన్ని స్థానాల్లో బిజేపి పోటీ చేయడంలో వ్యూహం ప్రధానంగా 1. తెలంగాణలో ఓటు బ్యాంక్ పెంచుకోవడం తద్వారా 2023-24 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం అంచుల్లోకి చేరుకోవాలనే ఆలోచన, 2. అంతర్గతంగా ఉన్న అవగాహన మేరకు కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవడం కోసం అన్ని స్థానాల్లో పోటీ చేసి టిఆర్ఎస్ గెలుపుకు తోడ్పడం. ఈ రెండు అంశాలలో స్వల్పకాలిక(ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ను అడ్డుకోవడం),దీర్ఘకాలిక(భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారం అంచులకు చేరుకోవడం) ప్రయోజనాల రీత్యా బిజేపి వ్యూహాన్ని పన్నింది.
అదే ఇదే ఇప్పుడు టిఆర్ఎస్ విజయానికి దోహదం చేస్తుంది.ఇక మహా కూటమి విషయంలో  జాతీయస్థాయిని దృష్టిలో పెట్టుకుంటే ఈ కూర్పు పనికి వస్తుంది,కాని రాష్ట్రం విషయంలో ప్రజలు ఆమోదించలేదు. ఓట్ల బదిలీలో అనేక సమస్యలున్నవి. టి.డి.పి ని మెజారిటీగా . బాలకృష్ణ లాంటి వాల్లు రావడాన్ని తెలంగాణ సమాజం వీల్ల పెత్తనం ఏమిటని ఇష్టపడలేదు. చంద్రబాబు ఫోటోను చివరి రెండు రోజుల్లో తొలగించడం కూడ ఇందుకు అర్థం చేసుకోవచ్చు.ఇంకో అంశం పరిశీలిస్తే….బిఎల్ఎఫ్ గురించి చెప్పుకోవచ్చు. ఇది కూడ చాలా స్థానాల్లో పోటీ చేయడం ద్వారా… వ్యతిరేక ఓట్లను కూటమి వైపు పోకుండా తను సంపాదించుకుంది. ఇలా ఒక వైపు బిజేపి మరియు బిఎల్ఎఫ్ రెండు కూడ అన్ని స్థానాల్లో( తమకు బలం లేనప్పటికీ) పోటీ చేయడం ద్వారా  తె.రా.స వ్యతిరేక ఓట్లను మహా కూటమి వైపు పోకుండా అడ్డుకొని ఆ ఓట్లు తామ ఖాతాలో వేసుకున్నవి.ఇక ఎలాగూ తెరాస ప్రభుత్వానికి ఉన్న ఓటు బ్యాంక్ కూటమి వైపు పోకుండా నిలబెట్టుకొని గెలుపు గుర్రంపై స్వారీ చేయడానికి తోడ్పడింది. ఇంత మంది కలిసి నన్నొక్కడిని ఓడించడానికి వస్తున్నరు అన్న కె.సి.ఆర్ మాటలపట్ల సానుభూతి చూపి టి.ఆర్.ఎస్ కే ఓటేశారు.
అంతే కాకుండా కూటమి పార్టీలు సీట్ల గొడవ,ఆలస్యంగా అభ్యర్థుల ప్రకటించడం కూటమి పట్ల ప్రజల్లో కొంత అనుమానాలకు దారితీసిందని చెప్పవచ్చు.ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్ర బాబు నాయుడు  అవసరానికి మించి ప్రచార కార్యక్రమం లో పాల్గొనడం పట్ల కూడా తెలంగాణా ప్రజల్లో తెలంగాణా ప్రజల్లో కస్టపడి సాదిన్చుకున్న తెలంగాణా తిరిగి ఆంధ్రప్రాంతం వారి చేతుల్లో కి పోతుందన్న అబద్రత భావం చోటుకుందని కుడా చెప్పవచ్చు. దీనికి ముఖ్యమంత్రి కేసిఆర్ తన చివరి ప్రచారం సందర్బంగా కూటమి గెలిస్తే తెలంగాణా తిరిగి ఆంధ్రావారి చేతుల్లోకి పోతుందన్న మాటలు తెలంగాణా ప్రజలను ప్రభావం చేసిందని చెప్పవచ్చు. దీనితో ఎలక్షన్స్ రొండు మూడు రోజులు ఉందనగా ప్రజలందరి నోట కూటమి మాటే వినిపించింది.అయితే చంద్రబాబు చివరివరకు ప్రచారం చేయడం,కేసిఆర్ సెంటిమెంటును లేవనెత్తడం వంటివి  టిఆర్ఎస్ గెలుపుకు దోహదం చేస్తున్న అంశాలు.
అందు వలన తెలంగాణ ప్రజలు  గుడ్దోడైనా, గూనోడైనా సరే కె.సి.ఆర్ ను ఇష్ట పడ్డారు.తప్ప టిఆర్ఎస్ పార్టీ ఫై గాని ఆ పార్టీ  నేతలపై గాని  టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేష పెట్టిన పతాకాల పట్ల ప్రజల్లో విశ్వాసం, నమ్మకం తో ప్రజలు ఓటు వేయలేదన్నది నగ్న సత్యం. అంతే  కెసిఆర్ చేపట్టిన కాళేశ్వరం ఆగి పోతుందో..యాదగిరి గుట్ట (యాదాద్రి) నిర్మాణం ఆగిపోతుందో..నని, ప్రజలు ఒటువేసారు.అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ (ప్రజా కూటమి)అధికారం  లోకి వస్తే  మల్లి భువనగిరి నయీం ముఠా బయటికి వస్తుందన్న వాదనలు కుడా లేకపోలేదు.అదే తెరాస విజయానికి దోహదపడిందని పరిశీలకులు పేర్కొంటున్నారు.