ఓపక్క చంద్రబాబు ప్రచారం జరుగుతుండగానే... మరోవైపు ఐటీ దాడులు

ఓపక్క చంద్రబాబు ప్రచారం జరుగుతుండగానే… మరోవైపు ఐటీ దాడులు

గురజాలలో చంద్రబాబు ప్రచారం
అదే సమయంలో అక్కడి టీడీపీ నేత ఇంట్లో సోదాలు
చర్చనీయాంశంగా మారిన ఐటీ సోదాలు
ఎన్నికల సమయంలో ఐటీ దాడులు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతల ఇళ్లలో సోదాలు జరిపిన ఐటీ అధికారులు ఈరోజు కూడా తమ తనిఖీలను కొనసాగించారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఎంపీపీ కాంతారావు నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. గురజాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సోదాలు జరగడం చర్చనీయాంశమైంది.