ఓటర్లపై టీడీపీ ఎంపీ జేసీ బెదిరింపులు

 

 

  • మంగళగిరిలో  ఏరులై పారుతున్న మద్యం డబ్బు

ఎన్నికల్లో ఎలాగయినా గెలుపొందాలనే పట్టుదలతో టీడీపీ వర్గీయులు అన్ని శక్తులను ఉపయోగిస్తున్నారు.    ప్రచారం ముగియడంతో ఓటర్లనుఆకట్టుకునేందుకు డబ్బు, మద్యం పంచడం చేస్తున్నారు. ఓటుకు రూ. రెండు నుంచి ఐదు వేల వరకు పంచుతోంది.మంగళగిరిలో టీడీపీ ఓటమి తథ్యమని భావించిన  ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోంది. తాడేపల్లి నులకపేటలో యదేచ్ఛగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.  ఐదు ఓట్లకు పైగా ఉన్న కుటుంబానికి ప్రిజ్‌, మొబైల్‌ ఫోన్స్‌ ,ఎల్‌ఈడీ టీవీలు పంపిణీ చేస్తున్నారు. విజయవకాశలపై విశ్వాసం సన్నగిల్లిన టీడీపీ.. దాడులు, దౌర్జన్యాలు, అరాచక శక్తులతో భయోత్పాతం సృష్టించి, తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకునే కుట్రకు తెగబడుతోంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ప్రచారం చేస్తున్నారు. అనంతపురంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఓటర్లపై బెదిరింపులకు దిగారు. తన కొడుకుకు ఓట్లు వేయకపోతే మీ అంతు చూస్తానంటూ పబ్లిగ్‌గా వార్నింగ్‌ ఇచ్చారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి నార్పల మండలంలో ప్రచారం చేశారు. ఆయన వర్గీయులు యధేచ్ఛగా డబ్బు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. బెదిరింపులకు దిగిన జేసీ వర్గీయులతో కురగానిపల్లి, నడిందోడ్డి, కేశవపల్లి గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. తమను జేసీ వర్గీయులు బెదిరింపులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు మొర పెట్టుకున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.