రేవంత్ రెడ్డి ఆస్తులు కేసుల వివరాల వెల్లడి!

ఐటీ విచారణకు డుమ్మా కొట్టిన రేవంత్ రెడ్డి!

ఆడిటర్ల ద్వారా డాక్యుమెంట్లు అందిస్తానన్న రేవంత్
విచారణకు హాజరు కాలేదన్న విషయాన్ని వెల్లడించిన ఐటీ అధికారులు
ఎన్నికల బిజీ వల్లే హాజరు కాలేకపోయినట్టు సమాచారం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఐటీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈరోజు ఆయన హైదరాబాదులోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరుకావాల్సి ఉంది. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. ఆడిటర్స్ ద్వారా డాక్యుమెంట్లను అందిస్తానని తెలిపారు. ఇప్పటికే రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు రెండు సార్లు విచారించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో బిజీ కారణంగా ఈరోజు ఆయన విచారణకు హాజరుకాలేక పోయినట్టు తెలుస్తోంది. విచారణకు రేవంత్ హాజరుకాని విషయాన్ని ఐటీ అధికారులు మీడియాకు తెలిపారు.