ఏ ఎన్నికైనా ఎగిరేది గులాబీ జెండానే: హరీశ్ రావు

ఏ ఎన్నికైనా ఎగిరేది గులాబీ జెండానే: హరీశ్ రావు

Share This

‘స్థానిక’ ఎన్నికల్లోనూ అగ్రస్థానంలో ఉండాలి
ఎవరికి టికెట్ ఇచ్చినా కట్టుబడి పనిచేయాలి
రాష్టానికే సిద్ధిపేట ఆదర్శంగా నిలవాలి
ఏ విజయమైనా టీఆర్ఎస్ దే నని, ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది గులాబీ జెండానే అని హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేటలో చిన్నకోడూరు, నంగునూరు మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల సన్నాహక సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న హరీశ్ రావు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అగ్రస్థానంలో ఉండాలని, ఈ నియోజకవర్గంలోని 5 జెడ్పీటీసీ, 45 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అగ్రస్థానంలో ఉండాలని అన్నారు. పార్టీ కార్యకర్తలు సైనికులలా పని చేసినప్పుడే తగిన గుర్తింపు లభిస్తుందని, ఎవరికి టికెట్ ఇచ్చినా దానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. ప్రతి కార్యకర్తను, నాయకుడిని తన కంటికి రెప్పలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్టానికే సిద్ధిపేట ఆదర్శంగా నిలవాలని, ఐక్యతకు మారుపేరుగా ఉండాలని కోరారు.