AP Assembly Speaker Kodela Sivaprasad

ఏపీ స్పీకర్‌ కోడెలకు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ నెల 10న కోర్టుకు హాజరు కావాలని కోడెలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో రూ.11 కోట్ల 50లక్షలు ఖర్చుపెట్టానని కోడెల ఓ ఇంటర్వ్యూలో చెప్పారని పిటిషనర్ సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించిన పిటిషనర్ ఐటీ అధికారులతో విచారణ జరిపించాలని కోరారు. ఇదే కేసులో గతంలో హైకోర్టులో స్టే పొందగా…అది గత నెల 27తో ముగిసింది.