ఏపీ సీఎం జగన్ కు శుభాకాంక్షలు – డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేటితో 100 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నా నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రిగా నిలిచిన వైఎస్ జగన్మొహన్ రెడ్డి 100 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారని ఆమె ప్రశంసించారు. ఏ పి పరిపాలన విషయంలో దేశం మొత్తం జగన్ అడుగుజాడల్లో నడుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పుష్ప శ్రీవాణి ట్వీట్ చేశారు.