మీ తీరు దుర్మార్గం... ఈసీకి 8 పేజీల సుదీర్ఘ లేఖ రాసిన చంద్రబాబు!

ఏపీ రాజకీయాల మరో బిగ్ సర్వే..ఫలితాలు పక్కాగా ఉంటాయట.!

Share This

ఏపీలోని ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక అందరి దృష్టి ఫలితాల మీదనే పడింది.దీనితో తీవ్ర స్థాయిలో జరిగిన త్రిముఖ పోరులో ఏ పార్టీకి గెలుపు సొంతమవుతుందో తేల్చి చెప్పడం సామాన్య ప్రజానీకానికి కష్ట తరంగా మారుతున్న ప్రశ్నగా మారింది.కానీ ఎప్పటి నుంచో రాజకీయాల మీద అపార పరిజ్ఞ్యానం ఉన్నటువంటి చాలా మంది సీనియర్ నేతలకు మాత్రం అది కష్టతరం కాదు.అలాంటి కొంత మంది సీనియర్ రాజకీయ పరిజ్ఞ్యానం ఉన్నవారు ఒక సంస్థ గా చేరి చేపట్టి ఒక బిగ్ సర్వేను అందులోను దశలు వారీగా ఏపీ ప్రజల నాడిని తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలో కూడా గట్టిగానే కష్ట పడ్డారట.

వారు చేసిన సర్వేలో పోటీకి దిగిన మూడు పార్టీలకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని గట్టిగానే చెప్తున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు.వీరు ముందు చేపట్టిన సర్వేలో గత కొంత కాలం క్రితమే అప్పటికప్పుడు ఎన్నికలు పెట్టినట్టయితే తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని వెల్లడైందట.అలాగే ఆ తర్వాత నిర్వహించిన సర్వేలో కూడా చంద్రబాబుకి అధికారం దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ సీట్లు తగ్గిపోతాయని తేలిందట.

ఇక ఆఖరుగా నిర్వహించిన సర్వేలో అయితే అస్సలు ఊహించని ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు.ఆ ఫలితాల్లో అయితే వైసీపీకి గరిష్టంగా 120 స్థానాలు గెలిచేందుకు అవకాశం ఉందని తేలినట్టు వారు తెలిపారు.పది సీట్లు అటు ఇటు అయినా సరే ప్రభుత్వాన్ని స్థాపించేది మాత్రం జగనే అని వారు గట్టిగా చెపుతున్నారట.ఈ ఫలితాలు ఖచ్చితంగా నిజమవుతాయని వారు చాలా బలంగా నమ్ముతున్నారు.మే 23 తర్వాతే వారి సంస్థ పేరు కూడా బయట పెడతామని వారు తెలిపినట్టు విశ్లేషకులు అంటున్నారు.మరి వీరు ఇంత నమ్మకంతో చెప్తున్నా సర్వే ఫలితాలు ఎంత వరకు నిజమవుతాయో తెలియాలంటే వచ్చే 23 వరకు ఆగాల్సిందే.