ఎన్టీఆర్ బయోపిక్ నుంచి సావిత్రిగా నిత్యామీనన్ లుక్

షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్
సావిత్రి పాత్రలో నిత్యామీనన్
దీపావళి కానుకగా స్పెషల్ పోస్టర్
క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ చకచకా షూటింగు జరుపుకుంటోంది. ‘కథానాయకుడు’ పేరుతో మొదటిభాగాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తోంది. తాజాగా సావిత్రిగా నిత్యామీనన్ లుక్ ను విడుదల చేశారు. దీపావళి కానుకగా కొంతసేపటి క్రితమే ఆమె లుక్ ను వదిలారు.

‘గుండమ్మ కథ’లో సావిత్రి పప్పు రుబ్బుతూ వుంటే ఎన్టీఆర్ వచ్చి సాయం పడతాడు. అందుకు సంబంధించిన సన్నివేశంలోని స్టిల్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ .. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. బొద్దుగా వుండే నిత్యామీనన్ సావిత్రి పాత్రలో చక్కగా కుదిరిపోయినట్టే అనిపిస్తోంది. నిజానికి ‘మహానటి’లోనే సావిత్రి పాత్రను నిత్యామీనన్ చేయవలసింది గానీ కుదరలేదు. ఈ సినిమాతో మళ్లీ అలాంటి అవకాశం నిత్యామీనన్ కి దక్కడం నిజంగా విశేషమే.