ఎగ్జిబిషన్ ఘటనలో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటాం: మంత్రి మహమూద్ ఆలీ

బాధితులెవరూ ఆందోళన చెందక్కర్లేదు
ఎటువంటి ప్రాణనష్టం లేదు
ఇలాంటి ఘటనలు పునరావృతం కానీయం
హైదరాబాద్ లోని నుమాయిష్ ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ హామీ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంతో చరిత్ర ఉన్న ఎగ్జిబిషన్ లో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని, ఈ ఘటనలో ఆస్తి నష్టం జరిగిందని, ఎటువంటి ప్రాణనష్టం లేదని చెప్పారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.