ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో ఐ టి దాడులు

  • శుక్రవారం ఉదయం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ నివాసంలో  పోలీసులు  విస్తృతముగా తనిఖీలు చేశారు.   సుమారు 30 మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకే సీఎం రమేశ్‌ ఇంటికి చేరుకున్నారు. సీఎం రమేశ్‌తో పాటు, ఆయన సోదరుడు సురేశ్‌ నాయుడు ఇంట్లోనే ఉన్నారు.  ఈసందర్భంగా పోలీసులు మూడంతస్తుల భవనంలో  విస్తృతముగా సోదాలు చేపట్టారు.

    సెర్చ్‌ వారెంట్‌ ఉందా? అని సీఎం రమేశ్‌ ప్రశ్నించగా..ఏమి చెప్పకపోవడం విశేషం .  ఈసందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తనిఖీలు నిర్వహిస్తున్నామని మాత్రం చెప్పారు. దాదాపు గంటసేపు సోదాలు నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వారు వెనుదిరిగారు. అనంతరం సీఎం అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.   పోలీసుల తనిఖీలపై సీఎం రమేష్‌ మండిపడ్డారు. కేవలం తెదేపా నేతలు, అభ్యర్థులే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఈ తనిఖీలు జరిగినట్లు అనుమానం కలుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ధర్మం తమ వైపు ఉన్నంతవరకూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.  ఇవన్నీ ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగించేందుకేనని సీఎం రమేశ్‌ ఆరోపించారు.  కేంద్రంలోని భాజపా, జగన్‌ కుమ్మక్కై ఈ దాడులు చేయిస్తున్నారని అయన దుయ్యబట్టారు.