ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో విచారణ

ఉమ్మడి హైకోర్టు విభజనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్ 15 నాటికి అమరావతిలో తాత్కాలిక భవనం పూర్తవుతుందని కోర్టుకు ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది నారీమన్ తెలిపారు. డిసెంబర్‌లో నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజనపై నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్రానికి కోర్టు ఆదేశాలిచ్చింది. న్యాయాధికారుల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైందని ఏపీ తరపు న్యాయవాది నారీమన్ తెలిపారు. భవన నిర్మాణాలకు సంబంధించి ఫోటోలను అందించాలని కేంద్రం తరపు న్యాయవాది వేణుగోపాల్ కోరారు.