ఉగాది మహోత్సవానికి సిద్దమవుతున్న తెలుగు ప్రజలు

 

 

 

 

 

ఉగాది మహోత్సవానికి సిద్దమవుతున్న తెలుగు ప్రజలు .   తెలుగు ప్రజలు ఎంతో సంప్రదాయంగా చేసుకునే పండగ ఉగాది  ఎదురు చూస్తున్నసంబరాల ఉగాది రానే వచింది . పూల దండలు , తోరణాలతో ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు .

విళంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీవికారి నామ తెలుగు సంవత్సరాది ఉగాదిని జరుపుకునే సమయం, ముహూర్తం గురించి పండితులు తెలియజేశారు. ఉగాది పర్వదినం ఏప్రిల్ 6 శనివారం. వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఛైత్ర శుద్ధ పాడ్యమి మొదలైనా పండగ మాత్రం శనివారమే జరుపుకోవాలి.
ఇళ్లలో ఉగాది  పండగ రోజు చేయవలసినవి
ఉగాది రోజున అత్యంత ముఖ్యమైనది పచ్చడి. ఈ పచ్చడి ఏ సమయంలో తీసుకోవాలనేది కూడా వేద పండితులు తెలియజేశారు. ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి, పచ్చడి తయారు చేయాలి. దీనిని దేవునికి సమర్పించిన తర్వాత ఉదయం 7.40 నుంచి 10.30 మధ్యన తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది అత్యంత అనుకూలమైన సమయమని తెలిపారు. ‘శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ, సర్వారిష్ట వినాశాయనింకం దళబక్షణం’ అనే ఈ శ్లోకాన్ని ప్రత్యేకంగా చదివి పచ్చడి తీసుకోవాలి. వందేళ్లపాటు వజ్రదేహంతో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలని కోరుకోవడం దీని అర్థం.

అలాగే ఉదయం 10 నుంచి 11.45 మధ్య కొత్త వస్తువులు, పసుపు, బంగారం, బెల్లం మొదలైనవి కొనుగోలు చేయడానికి శుభ సమయమని వివరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారులు ఈ రోజునే కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు. కాబట్టి కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించడానికి ఉదయం 10.15 గంటల నుంచి 10.45 మధ్య మంచి ముహూర్తం. తిరిగి మధ్యాహ్నం 12.49లకు ముహూర్తం బాగుందని వెల్లడించారు