‘ఉగాది-నంది’ పురస్కారాల ప్రదానం

శ్రీలలిత కల్చరల్‌ అసోసియేషన్‌ సాంస్కృతిక, సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో ‘ఉగాది’ ని పురస్కరించుకొని సోమవారం రాత్రి రవీంద్రభారతి సమావేశ మందిరంలో ‘ఉగాది-నంది’ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.   ఈ కార్యక్రమానికి సాహిత్య అకాడమి కార్యదర్శి డా.ఏనుగు నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పురస్కార గ్రహీతలను  ఘనంగా  సన్మానించారు.  . దైవజ్ఞశర్మలు పురస్కార విజేతలను అభినందించారు. హరిహర రచించిన పిక్‌ యువర్‌ సన్‌ సైన్‌ న్యూమరాలజీ పుస్తకాన్ని ఏనుగు నరసింహారెడ్డి ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న హరిహర, డా.కె.సునంద, డా.ఈడ్పుగంటి పద్మజారాణి, సీహెచ్‌.లక్ష్మీదుర్గ, డా.నవీన్‌, వెంకటరమణమూర్తి, కృష్ణ, శ్రీనివాసాచారి లను ఉగాది-నంది పురస్కారాలతో సత్కరించారు. నిర్వహకురాలు డా.లలిత గన్నవరపు స్వాగతం పలికారు. సంస్థ కార్యదర్శి జి.రవిప్రసాద్‌, గీతాశివరామ్‌, జి.కామేశ్వరి దేవిలు సభా సమన్వయం చేశారు. సినీ సంగీత విభావరి, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.