acp caut app

శ్రీకాకుళం జిల్లాలో భారీగా నగదు స్వాధీనం..

 

 

సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు భారీగా నగదు బయటపడింది. ఈ బస్సు శ్రీకాకుళం నుంచి పాలకొండకు వెళుతండగా అధికారులు తనిఖీలు నిర్వహించారు.  ఈ మొత్తం నగదు సుమారు రూ.కోటి వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు. జిల్లాలోని రాజాం మండలం బొద్దాం వద్ద ఓ ఆర్టీసీ బస్సులో మూడు బ్యాగుల్లో పెద్దఎత్తున తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను రాజాం పోలీస్ స్టేషన్ కు తరలించారు.  కాగా, ఇదే బస్సులో పాలకొండకు చెందిన వైసీపీ నేత తనయుడు విక్రాంత్ ఉండటంతో ఆయన్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.