ఈ ఉదయం సుజనా చౌదరిని టార్గెట్ చేసుకున్న కేశినేని నాని!

Share This

నిన్నటి వరకూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను టార్గెట్ చేసుకుని, తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శల వర్షం కురిపించిన విజయవాట ఎంపీ కేశినేని నాని, ఈ ఉదయం తన టార్గెట్ ను మార్చుకున్నారు. పేరును వెల్లడించకుండా, “నేను ఎవరికైనా ఏమి అయినా ఇవ్వాలి అని ఎవరి దృష్టికి వచ్చినా నా వద్దకు తీసుకువస్తే నేను చెల్లించడానికి సిద్దంగా వున్నానని వందల సార్లు చెప్పడం జరిగింది. ఎప్పటికీ దానికి నేను కట్టుబడి వున్నాను.

నువ్వు బ్యాంకులకు కట్టవలసిన వేల కోట్లు కడితే దేశానికి మంచి చేసినవాడివి అవుతావు” అని ఆయన ట్వీట్ పెట్టారు. ఆ తరువాత “ప్రబుద్ధుడుతో నీకున్న అక్రమ సంబంధం ప్రజలకి అర్థమయింది” అని మరో ట్వీట్ పెట్టారు. నాని చేసిన ఈ తాజా వ్యాఖ్యలు టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఎంపీ సుజనా చౌదరి గురించేనని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply