ఈవీఎంల మీద కూడా పడ్డారు... చాలా సంతోషంగా ఉంది!: మోదీ వ్యంగ్యం

ఈవీఎంల మీద కూడా పడ్డారు… చాలా సంతోషంగా ఉంది!: మోదీ వ్యంగ్యం

Share This

మూడో విడత తర్వాత విపక్షాల్లో మార్పు వచ్చింది
ఇప్పుడు వాళ్లు ఈవీఎంలను కూడా విమర్శిస్తున్నారు
విపక్షాలపై మోదీ విసుర్లు
ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మొదట్లో తనను మాత్రమే విమర్శించేవాళ్లని, ఇప్పుడు వాళ్ల దృష్టి ఈవీఎంలపై కూడా పడిందని ఎద్దేవా చేశారు.

“తొలి మూడు విడతల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష నేతల దృష్టంతా నరేంద్ర మోదీని విమర్శించడంపైనే ఉంది. దాదాపు 40 మంది నేతలకు నన్ను తిట్టడమే పని. కానీ మూడో విడత పోలింగ్ ముగిశాక వాళ్లు ఈవీఎంలపై పడ్డారు. నాపై సగం ఫోకస్ పెట్టి మరో సగం ఫోకస్ ను ఈవీఎంలపై పెడుతున్నారు. ఆ విధంగానైనా నాపై విమర్శలు కాస్త తగ్గించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు విపక్షాల తిట్లు 50-50 ప్రాతిపదికన విభజన చెందాయి. సగం నాపై, సగం ఈవీఎంలపై” అంటూ వ్యంగ్య ధోరణిలో మాట్లాడారు.