‘ఇస్మార్ట్ శంకర్’లో మరో కథానాయికగా నభా నటేశ్

తెలుగు తెరకి ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో నభా నటేశ్ కథానాయికగా పరిచయమైంది. తొలి సినిమాతోనే ఈ అమ్మాయి హిట్ కొట్టేసింది. దాంతో ఇక వరుస అవకాశాలు వస్తాయని అంతా భావించారు. అయితే ఆశించిన స్థాయిలో ఈ అమ్మాయికి అవకాశాలు రాలేదు. ఒకటి రెండు ప్రాజెక్టులు చేద్దామనుకుంటే అవి పట్టాలెక్కలేదు.

దాంతో రెండవ సినిమాకి ఈ అమ్మాయికి కొంచెం గ్యాప్ వచ్చింది. తాజాగా పూరి జగన్నాథ్ .. రామ్ హీరోగా చేస్తోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో కథానాయికగా ఈ అమ్మాయిని తీసుకున్నారు. ఆల్రెడీ ఒక కథానాయికగా నిధి అగర్వాల్ ను తీసుకున్నారనే వార్తలు వచ్చేశాయి. నిధి అగర్వాల్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కనుక రెండవ కథానాయికగా నభా నటేశ్ ను తీసుకున్నారని అనుకోవచ్చు.