వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన డేటా చోరీ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద సైబర్ విద్రోహ చర్యని

ఇది దేశంలోనే అతి పెద్ద డేటా చోరీ కుంభకోణం.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన విజయసాయిరెడ్డి!

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన డేటా చోరీ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద సైబర్ విద్రోహ చర్యని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఇంకా ఏయే వ్యవస్థల్లోకి చొరబడ్డారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దొంగిలించిన సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థలను కుప్పకూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయసాయిరెడ్డి ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘చంద్రబాబు డేటా చోరీ స్కాం దేశంలోనే పెద్ద సైబర్ సాబోటేజ్ క్రైమ్. రహస్య సమాచారాన్ని బజారులో పడేశారు. ఇంకా ఏయే వ్యవస్థల్లోకి చొరబడ్డారో తేల్చాలి. దొంగిలించిన సమాచారంతో ఏపీ ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కుప్పకూల్చాడు’ అని ట్వీట్ చేశారు.