ఇక్కడ ప్లాపయిన బెల్లం బాబు సినిమా అక్కడ అదరగొడుతుందిగా.!

ఇక్కడ ప్లాపయిన బెల్లం బాబు సినిమా అక్కడ అదరగొడుతుందిగా.!

Share This

తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన యంగ్ హీరోల్లో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకరు.అయితే తాను చేసిన కొద్ది సినిమాలతోనే మాస్ లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.తాను హీరోగా కాజల్ మరియు మెహ్రీన్ లు హీరోయిన్లుగా నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “కవచం”.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచింది కానీ యూట్యూబ్ లో మాత్రం రోజుకొక 10 మిలియన్ వ్యూస్ ను తన ఖాతాలో వేసుకొని సినీ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఈ సినిమాను హిందీలో డబ్ చేసి “ఇన్స్పెక్టర్ విజయ్” గా విడుదల చెయ్యగా కేవలం ఒక్క రోజులోనే 16 మిలియన్ వ్యూస్ రాబట్టి ఆశ్చర్యపరిచింది.ఇదొక్కటేనా ఆ తర్వాత కూడా బెల్లం బాబు తన రేజ్ చూపించాడు.పెట్టి నాలుగు రోజుల్లో మొత్తం 40 మిలియన్ వ్యూస్ లాగేసి అంతకంతకు ఆశ్చర్యపరిచాడు.మన దగ్గర ప్లాప్ గా నిలిచిన ఈ సినిమాకు ఈ రేంజ్ వ్యూస్ రావడం అంటే షాకింగే అని చెప్పాలి.ఈ ఫీట్ ను టచ్ చెయ్యడానికి మన స్టార్ హీరోలకు చాలా టైం పట్టింది.కానీ బెల్లం కొండా శ్రీనివాస్ కుయ్ మాత్రం 4 రోజులే పట్టింది.దీని బట్టి హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగా నచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.ఇప్పటికి ఈ సినిమాకు 40.6 మిలియన్ వ్యూస్ మరియు 4 లక్షల 20 వేల లైక్స్ తో నెంబర్ 12 ట్రెండింగ్ లో ఉంది.మరి బెల్లం బాబు 50 మిలియన్ మార్కును ఎప్పుడు అందుకుంటాడో చూడాలి.