పతనావస్థలో కర్ణాటక సర్కారు.. రాజీనామా యోచనలో కుమారస్వామి?

ఇంకో 24 గంటల్లో కర్ణాటక రాజకీయం మారనుంది

ఎమ్మెల్యేల బెదిరింపులు, ప్రతిపక్షం భాజాపా దూకుడుతనం, మిత్రపక్షం కాంగ్రెస్ మాట వినని పరిస్తితి.. అన్నీ కలిసి ముఖ్యమంత్రి కుమారస్వామి ఆసహనాన్ని తారాస్థాయికి చేర్చాయి. అలిగిన ఎమ్మెల్యేలు కనీసం చర్చలకు కూడా రాకపోవడంతో ఆత్మాభిమానం చంపుకుని బ్రతిమాలడం ఇకపై తన వల్ల కాదని కుమారస్వామిని సిఎం పదవికే రాజీనామా చెసే దిశగా పురిగొల్పాయి.

కర్ణాటకలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్తితుల దృష్ట్యా కుకరస్వామి రాజీనామాకు సిద్దమైపోయిన వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇంకాసేపట్లో ఆయన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అది దొరికితే మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామాను సమర్పిస్తారని తెలుస్తోంది. దీంతో అనేక ఒడిదడుకుల మధ్య సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడనుంది.

ఇక భాజాపా అయితే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చేసింది. తర్వాతి ఘట్టం తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమేనని భావిస్తూ పార్టీ కీలక నేతలతో మంతనాలు జరుపడం స్టార్ట్ చేసింది. మొత్తానికి ఈరోజు గడిచేసరికి కర్ణాటక రాజకీయాల్లో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.