ఆలీ వెన్నుపోటుకి రామోజీ అడ్డుకట్ట!

ఆలీ వెన్నుపోటుకి రామోజీ అడ్డుకట్ట!

Share This

పవన్‌కళ్యాణ్‌తో రాజకీయంగా విబేధించినా కానీ అతనెప్పుడూ తన గుండెల్లో వుంటాడని ఆలీ ఉద్ఘాటించిన సంగతి తెలిసిందే. తనని ఆలీ ఏ విధంగా నమ్మించి పక్క పార్టీలోకి దూకేసాడో పవన్‌ మాట్లాడడం సంచలనమయింది. ఆ సందర్భంలో కూడా పవన్‌ని ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదని ఆలీ చెప్పుకున్నాడు. కానీ అప్పటికే పవన్‌ని వెక్కిరిస్తూ ఒక పాత్రని తానే స్వయంగా పోషించేసాడు. ఆలీ వెన్నుపోటు అంతటిలో ఆగలేదు. రేణుదేశాయ్‌ని తన టాక్‌ షోకి పిలిపించి ఆమెతో ఎమోషనల్‌ సంగతులు మాట్లాడించాడు.

ఆ టాక్‌ షోలో ఆమె ఎప్పటిలానే పవన్‌ పట్ల కోపం కలిగేలా కొన్ని విషయాలు చెప్పింది. మరి నాణేనికి రెండో వైపు ఏమిటనేది తెలుసుకోవడానికి పవన్‌ ఎప్పుడూ వీటి గురించి మాట్లాడింది లేదు. కాకపోతే సరిగ్గా ఎన్నికలకి ముందు ఈ షో ప్రసారమయ్యేలా ఆలీ పెద్ద ఎత్తే వేసాడు. కానీ అది రాజకీయంగా పవన్‌కి చేటు చేస్తుందని భావించి రామోజీ సదరు ఎపిసోడ్‌ని ఎన్నికల తర్వాతకి షెడ్యూల్‌ చేసారట. అదే సెన్సేషనలిజమ్‌ కోసం తాపత్రయ పడే ఛానల్‌కి ఈ ఇంటర్వ్యూ దొరికినట్టయితే పవన్‌ని ఎంత దెబ్బ కొట్టాలో అంతా దెబ్బ కొట్టాలని చూసేవి. స్నేహితుడు, గుండెల్లో వున్నాడని అంటూనే ఆలీ ఎంత ఎత్తు వేసాడో చూడండంటూ పవన్‌ ఫాన్స్‌ గుస్సా అవుతున్నారు.