ఆర్మీ జవాన్ల కీచక పర్వం.. బధిర మహిళను బ్లాక్ మెయిల్ చేస్తూ నాలుగేళ్లుగా అత్యాచారం!

మహారాష్ట్రలోని ఖడ్కీ సైనిక ఆసుపత్రిలో ఘటన
ఎన్జీవో సంస్థ చొరవతో బయటకొచ్చిన వ్యవహారం
కేసు నమోదుచేసిన పోలీసులు
దేశాన్ని, ప్రజల మానప్రాణాలను రక్షిస్తామని ప్రమాణం చేసిన జవాన్లు దాన్ని మర్చిపోయారు. జంతువుల్లా మారిపోయి ఓ బధిర మహిళపై తమ మృగవాంఛను తీర్చుకున్నారు. అక్కడితో ఆగకుండా ఈ దారుణాన్ని ఫోన్ లో వీడియో తీసి బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరికి బాధితురాలు ఓ ఎన్జీవో సంస్థ సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఖడ్కీ మిలటరీ ఆసుపత్రి ఆవరణలో బాధితురాలు ఉంటోంది. ఈ నేపథ్యంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న నలుగురు ఆర్మీ జవాన్లు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని ఫోన్ లో వీడియో తీశారు. అనంతరం ఈ వీడియోను బయటపెడతామని బెదిరిస్తూ గత నాలుగేళ్లుగా బాధితురాలిపై ఈ అకృత్యాన్ని కొనసాగిస్తున్నారు. చివరికి ఓ ఎన్జీవో సాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా ఈ విషయమై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ కు ఎన్జీవో సంస్థ సాయంతో లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో నలుగురు ఆర్మీ జవాన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.