ఆర్థిక సర్వే:ఆర్థిక వృద్ధి 6 శాతం నుంచి 6.5 శాతం

 

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ఆర్థిక సర్వేను  ప్రవేశ పెట్టారు.  శనివారం ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 6 శాతం నుంచి 6.5 శాతం వరకు ఉండవచ్చునని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందులోని కొన్ని అంశాలు.. ఇంటి కొనుగోలుపై భారం తగ్గించండి: నిర్మలమ్మకు విజ్ఞప్తి,  వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలి – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం మరిన్ని సంస్కరణలు చేపట్టాలి. – మార్కెట్లు అందుబాటులోకి తీసుకురావడం, వ్యాపార అనుకూల విధానాలని ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి. – 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు నైతిక విలువలతో కూడిన సంపద కీలకం. – ఏప్రిల్ 1తో ప్రారంభమయ్యే 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6 శాతం నుంచి 6.5 శాతంగా ఉండొచ్చు. గ్రోత్ రేటు పడిపోయింది – వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోని పరిస్థితులు భారత్‌కు అనుకూలం. – 2019లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. 2009లో ఆర్థిక సంక్షోభం అనంతరం వరల్డ్ ఔట్ పుట్ గ్రోత్ రేట్ అంచనా 2.9 శాతంగా నమోదవుతుందని అంచనా. ఇది 2018లో 3.6 శాతం, 2017లో 3.8 శాతంగా నమోదయింది.

వచ్చే ఏడాది పన్ను ఆదాయంలో పెరుగుదల – ద్రవ్యలోటు విషయంలో కొంత సడలింపు ఉండాలి. – ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయాలు అంచనాల కంటే తగ్గవచ్చు. – వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ పన్ను ఆదాయం పెరిగే అవకాశం – 2011-12 నుంచి 2017-18 మధ్య 2.62 కోట్ల ఉద్యోగాల సృష్టి భోజనం కొనుగోలు శక్తి 29 శాతం పెరిగింది – ఒక ప్లేటు భోజనం కొనుగోలు చేసే శక్తి 29 శాతం మెరుగుపడింది. – 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. – ఎంఎస్ఎంఈ తరహా వ్యాపార సంస్థలకు రుణ సదుపాయం, టెక్నాలజీని అందించడం, ఈవోడీబీ మార్కెట్లను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కట్టుబడి ఉంది. – హైవేలు, రోడ్లపై పెట్టుబడులు 2014-15 నుంచి 2018-19 మధ్య మూడు రెట్లు పెరిగాయి.

భారతీయ రైల్వే రికార్డ్ – భారత వాణిజ్య పరిమాణంలో 95 శాతం, మొత్తం కరెన్సీ విలువలో 68 శాతం సరుకులు సముద్రమార్గంలో రవాణా జరిగింది. – భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక మందిని రవాణా చేసిన సంస్థగా రికార్డ్ సృష్టించింది. 120 కోట్ల టన్నుల సరుకు, 840 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. – భారత్‌లో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతంగా జరగాలని సర్వే సూచించింది. ఉచితాలు నష్టదాయకం, రుణమాఫీ సరికాదు – లాభదాయకత, సామర్థ్యం, పోటీతత్వం, నైపుణ్యం పెంచేందుకు ఇవి అవసరం. – ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు నష్టదాయకం. లబ్ధిదారులు తక్కువ ఖర్చు పెడతారు. తక్కువ పొదుపు చేస్తారు. తక్కువ పెట్టుబడి పెడతారు. – రుణమాఫీలు రుణ వ్యవస్థను దెబ్బతీస్తాయి.