ఈ ఎన్నికల్లో బీజేపీకి అంతకుమించి సీట్లు రావు!: చంద్రబాబు జోస్యం

గెలుపు మలుపులో …జగన్

Share This

చంద్రబాబుకు వయసయిపోయింది. ఆయనకు మతిమరుపూ ..చాదస్తం రెండూ వచ్చేసాయి. ఇక పదవికి దూరం జరిగితే మంచిదంటూ చేసే ముదురు వ్యాఖ్యానాలకు మేము దూరం. సమర్ధతలనేవి వయసుతో కొంత పరిమితమవుతాయేమో గానీ పూర్తిగా అదృశ్యం కావన్న నిజాన్ని గుర్తించాలి. జ్ఞాపకశక్తులు తగ్గవచ్చు, చెప్పిందే చెప్పి విసుగులు పుట్టించవచ్చు. అయితే అనుభవాలు ఎక్కడికి పోతాయి. ఆయనకున్న అపారమైన పాలానానుభవం గొప్పది. అయితే బాబుతో ఉన్నఒకే ఒక సమస్య …అదీ అందరూ చెప్పే సమస్య … ఆయన అవసరార్ధం మనుషుల్ని చేరదీసి..ఉపయోగించుకుని వదిలేస్తారు.

ఇందులో నిజానిజాల్నిపక్కనబెట్టేసి …అసలు విషయానికి వద్దాం. ఈసారి బాబు ఓడిపోతే …ఇకమున్ముందు తెలుగు దేశం పార్టీ నాయకత్వానికే సవాళ్లు ఎదురుకావచ్చు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వాళ్లకున్న నాయకత్వ సామర్ధ్యాలు అటుంచితే ఆయన ఏరికోరి వారసుడిగా తెచ్చుకున్న సుపుత్రుడు లోకేష్ సామర్ధ్యాల మాటేంటి? పార్టీలో ఎంతమంది అతని నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? అదేమీ కనిపించదు. రేపు ఓటమి కనుక ఎదురై ఒకవేళ బాబు తన నాయకత్వాన్ని ఏ కారణం చేతనైనా లోకేష్‌కు బదిలీ చేయాలనుకుంటేఅటువంటి పరిస్థితిలో పార్టీ తిరిగి బతికిబట్టకట్టగలదా? పునర్వైభవాన్ని సంతరించుకోగలదా? పూర్తిగా అనుమానమే! ఇది బాబుకు చివరి అవకాశం ఎందుకవుతుందంటే.. ఆయన తన పంథా మార్చుకోలేకపోతున్నారు. గంటల తరబడి చేసే ఉపన్యాసాలు.. జరిపే సమీక్షలూ అధికార యంత్రాంగంలో కదలికలు తీసుకొస్తున్నాయా? పాలనా వ్యవస్థను గాడిలో పెట్టగలుగుతున్నాయా? ఆయనగారి పబ్లిసిటీ యావ … ఆయనగారి దుబారా ఖర్చులూ … ఇలా ఆయనమీదున్న ఆరోపణలకు సరైన జవాబుల్లేవు. ఈ చాంతాడు ఆరోపణలన్నీ పక్కనపెట్టినా … అధికారం ఉంటేనే తోకలు జాడించే నాయకులు ఇక అదే అధికారంలేని రోజున చూపించబోయే విన్యాసాల గురించి బాబుకెందుకు తెలియదు.

అక్కడ నాయకత్వ బదిలీకి ఎవ్వరూ సిద్ధంగా లేరు. పోనీ ఆయనే మోసే పరిస్థితి ఉందా అంటే అక్కడా అనుమానాలు పొడసూపుతున్నాయి. అందుకే అన్నది …బాబు నాయకత్వంలోని తెలుగుదేశానికి ఇదే చివరి ఎన్నికలవుతాయి. రేపటి రోజున తెలుగు దేశం-వైస్సార్సీపీలు సమాన స్థాయిలోనే లేక కాస్త అటూ ఇటూగానో సీట్లు సంపాదించుకున్న పక్షంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల బేరసారాలు తప్పవు. ఇక నిశబ్ద విప్లవం పేరుతో ఆశల పల్లకిని ఎక్కి కూర్చున్న జనసేన కనుక కొన్ని సీట్లు సంపాదించుకుంటే కర్ణాటకలో కుమారస్వామిలాగా గద్దెనెక్కుతాడన్న విశ్లేషణలూ జరుగుతున్నాయి. తెలుగు ప్రజల తీర్పులు స్పష్టంగానే ఉంటాయన్నది ఒక నిజం. సైకిలో..పంఖానో ఆటో ఇటో తేలిపోతుంది. చంద్రబాబు-జగనులిద్దరి మధ్యా జరిగిన ఫైనల్ అండ్ లాస్ట్ మ్యాచ్ ఇదే.. రిజల్ట్స్ అర్ అవైటెడ్..అంతే ..!