ఆదాయ పన్ను పరిధి పెంపునకు చంద్రబాబు బీపీకి లింక్ పెట్టిన కన్నా!

తాత్కాలిక బడ్జెట్ లో ఆదాయపన్ను పరిధి పెంచారు
బీజేపీ నాయకులపై చంద్రబాబు బీపీ పెంచుకున్నారు
ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందేమో అనిపించింది: కన్నా సెటైర్లు
ఏపీకి జరిగిన అన్యాయం చూస్తుంటే తన రక్తం పొంగుతోందంటూ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ఉద్వేగపూరిత వ్యాఖ్యలపై కన్నా లక్ష్మీనారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ లో ఆదాయపన్ను పరిధి పెంచడం, ఏపీ అసెంబ్లీలో బీజేపీ నాయకులపై చంద్రబాబు బీపీ పెరగడం చూస్తుంటే ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందేమో అనిపించిందని వ్యాఖ్యానించారు. ఆదాయపన్ను పెరుగుదల దేశానికి, సామాన్యులకు మేలు చేస్తుందని, చంద్రబాబు బీపీ పెరగడం ఆయన ఆరోగ్యానికి హానికరమని సెటైర్లు విసిరారు.